తూచ్..NTR కోసం దీపికా కాదు..ఆ గ్లోబల్ బ్యూటీని లైన్ లో పెట్టిన ప్రశాంత్ నీల్..!?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 5 ఏప్రిల్ 2024న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . కాగా సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతున్న.. కొన్నాళ్ల వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని కొరటాల శివ. తర్వాత మాత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులను చక చక పూర్తి చేస్తున్నారు . ఇప్పటికే రెండు షెడ్యూల్ టకటక కంప్లీట్ .. చేసిన కొరటాల శివ మూడో షెడ్యూల్ సైతం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది .

కాగా ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత తారక్ చేయబోతున్న ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ 31 సినిమా షూట్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్. కాగా సలార్ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే .. ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై కి తీసుకెళ్లన్నారు.

ఈ క్రమంలోనే సినిమా కోసం క్యాస్ట్ అండ్ క్రూను సెలెక్ట్ చేసే పనిలో బిజీ అయ్యాడు ప్రశాంత్ నీల్. రీసెంట్గా ఈ సినిమాలో దీపికా పదుకొనే ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . అయితే అవంతా ఫేక్ అని అయితే గ్లోబల్ బ్యూటీతోనే ఎన్టీఆర్ రొమాన్స్ చేయబోతున్నాడని అది దీపికా కాదు ప్రియాంక చోప్రా అంటూ తెలుస్తుంది . హాలీవుడ్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఎంత హాటుగా కనిపిస్తుందో అందరికీ తెలిసిందే ఎటువంటి యాక్షన్ సీన్స్ అయినా సరే అవలీలగా నటించేస్తుంది . అలాంటి ముద్దుగుమ్మ అయితే ఎన్టీఆర్ పక్కన ది పర్ఫెక్ట్ జోడి అని అందుకోసమే ప్రశాంత్ నీల్ మనసు మార్చుకొని దీపికాను రిజెక్ట్ చేసి ప్రియాంకను ఫైనల్ చేశాడని తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!