శ్రీదేవి ని మురళీమోహన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?

టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన అన్నిటినీ ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అయితే శ్రీదేవి పై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ శ్రీదేవితో పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Bangaru Chellelu Songs - Annayya Hrudayam - Murali Mohan, Sridevi - video  Dailymotion
నటుడు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 10 సంవత్సరాలు పైనే అవుతోంది. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి కూడా రాజకీయాలకు రాజీనామా చేస్తే పూర్తిగా సినిమాలకే సమయాన్ని కేటాయించబోతున్నట్లు గత కొన్ని నెలల క్రితం తెలియజేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకి మంచి పేరు ఉందని ఇండస్ట్రీలో ఉన్న శ్రీరామచంద్రుడు నేనే అని అక్కినేని నాగేశ్వరరావు తనని ఆ విధంగా సంబోధించే వారిని తెలిపారు. దీంతో ఈ విషయం శ్రీదేవి అమ్మగారు నాగేశ్వరరావు గారి నోటి నుంచి ఈ మాట విన్న తర్వాత తన కూతుర్ని తనకిచ్చి వివాహం చేయాలని ఆలోచనలో ఉండేదట. ఆ సమయంలో తనని చూడడానికి కూడా శ్రీదేవి తల్లి వచ్చిందని తెలిపారు..తన కూతురు సంతోషం కోసం ఇలా ఆలోచించినట్లుగా తెలియజేశారు మురళీమోహన్. కానీ ఎందుకు అది సెట్ కాలేదని తెలిపారు మురళీమోహన్.

మురళీమోహన్ రాజకీయ నాయకుడిగా,నటుడుగా గానే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మురళీమోహన్ అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుతూ తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్న మురళీమోహన్ ఇలా ఇంటర్వ్యూలలో కూడా అందరిని పలకరిస్తూ ఉంటారు. తాజాగా మురళీమోహన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.