ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిఖిల్ కి మెగా హీరోల సపోర్ట్ బాగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 27న స్పై మూవీ ప్రీ రిలీస్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. అయితే ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వెళ్లబోతున్నారు. అంతేకాకుండా తాజాగా రామ్ చరణ్ నిర్మాతగా మారి నిర్మించిన ‘ఇండియా హౌస్’ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. దాంతో నిఖిల్ కి మెగా ఫ్యామిలీ నుండి గట్టిగానే సపోర్ట్ దొరుకుతుందిగా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే నిఖిల్ నటించిన కార్తికేయ -2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక అప్పటినుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసి వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాంటి డిఫరెంట్ సినిమా ల లిస్ట్‌లో ముందుగా స్పై సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇక ఆ తరువాత ఇండియన్ హౌస్, స్వయంభూ సినిమాలు రిలీస్ అవుతాయి. అంతేకాకుండా కార్తికేయా 3 సినిమా కూడా రిలీజ్ అయ్యే వరుసలో ఉంది. అయితే నిఖిల్ ను మెగా ఫ్యామిలీ కమర్షియల్ కోణంలోనే సపోర్ట్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.