2023లో ఏ స్టార్ హీరో సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. దీంతో ఈ సంవత్సరం సమ్మర్ మొత్తం ఖాళీ గానే గడిచిపోయింది. ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే చాలు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయని థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. అభిమానులు ఏదో ఈసారి అడపాదడపా సినిమాలతో ఇలా సాగిపోయిందనీ చెప్పవచ్చు.
టాలీవుడ్ లో తదుపరి లైసెప్ జూలై నుండి దసరా వరకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు పై క్రిస్మస్.. సంక్రాంతి టార్గెట్ గా మారికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.2023 అలా గడిచినా కూడా 2024 సమ్మర్ మాత్రం రసవత్తరంగానే కనిపిస్తోంది. ఈసారి అగ్ర హీరోలంతా కొత్త సినిమాలలో మునిగి తేలుతున్నారు. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్ధమవుతోంది.
ఇక పుష్ప-2 సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి సమయాన్ని చూసుకొని రిలీజ్ చేయాలి ఈ లెక్కలో సినిమా సమ్మర్ లోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.ఇక అదే టైంలోనే రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కూడా సమ్మర్ కే ఫిక్స్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్ కి చేరింది. కానీ ఈ సినిమా రిలీజ్ కి వేసవికాలం అయితే అనుకూలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో థియేటర్ల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు షూటింగ్ ఇదే ఏడాది పూర్తి చేయాలన్న కానీ ఇంకో 6 నెలలు పట్టేలా కనిపిస్తోంది. కాబట్టి ఈ సినిమా కూడా వేసవిలోనే రిలీజ్ అవుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈసారి ఈ స్టార్ హీరోలది హవా అన్నట్లుగా సమాచారం.