ఊర మాస్ లెవల్లో భోళా శంకర్ టీజర్..!!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్ ఈ సినిమాని తమిళ చిత్రం వేదాలం సినిమాకు రీమేకుగా తెరకెక్కించడం జరుగుతోంది.భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు మెగాస్టార్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని హీరో సుశాంత్ కు కీర్తి సురేష్ కు జోడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Bholaa Shankar Teaser 💥💥 Megastar Chiranjeevi | Thamannah, Keerthy Suresh  | Meher Ramesh | FH - YouTube

అవుట్ అండ్ డౌట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది.. ఈ టీజర్ విషయానికి వెళ్తే 33 మందిని ఒక్కడే చంపేశాడు అని డైలాగ్ తో ఈ సినిమా టీజర్ మొదలవుతుంది. ఇక ఆ తరువాత చిరంజీవి ఎంట్రీ కావడం ఆ వెంటనే విలన్స్ తో పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయే రేంజిలో ఈ సినిమా టీజర్ నీ చూపించడం జరిగింది.

ఇక టీజర్ ఎండింగ్లో.. ఏ భోళా ఇది నా ఏరియా అని విలన్ చెప్పగానే ఈ స్టేట్ డివైడ్ అయిన అందరూ నావాళ్లే.. నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు అంటూ చిరంజీవి తెలంగాణ భాషలో చాలా స్టైలిష్ గా చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ డైలాగ్ ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించేలా చేస్తూ ఉండడం గమనార్హం. ఓవరాల్గా చిరంజీవి ఫ్యాన్స్ నుండి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారు. అలాంటివన్నీ కూడా భోళా శంకర్ చిత్రంలో పుష్కలంగా ఉన్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఓవరాల్గా అభిమానులను మెప్పించే విధంగా ఈ టీజర్ ఉన్నట్లుగా చెప్పవచ్చు మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.