ఎట్టకేలకు వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్..!!

హీరో గోపీచంద్ నటించిన జిల్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు కబీర్ దుహాన్ సింగ్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టైలిష్ విలన్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ విలన్ తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా విలన్ గానే నటించి బాగానే పేరు సంపాదించారు. తాజాగా కబీర్ దుహాన్ సింగ్ ఓ ఇంటివాడు అయ్యాడు అన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని సీమా చాహాల్ నీ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Actor Kabir Duhan Singh of Shaakuntalam fame ties the knot with Seema  Chahal - Kabir Weds Seema: अभिनेता कबीर दुहन सिंह की हुई शादी, सीमा को  बनाया हमसफर
దుహన్ సింగ్ వివాహ విషయం గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నిన్నటి రోజున వీరి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. హర్యానాలోని ఫరీదాబాద్ లో పుట్టి పెరిగిన కబీర్ దోహన్ సింగ్ ఎన్నో ఫ్యాషన్ షోలో మోడల్గా కూడా కనిపించినట్లు తెలుస్తోంది .మొదటిసారిగా జిల్ సినిమాతోనే టాలీవుడ్లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం.

From Silver Screen to Wedding Scene: Kabir Duhan Singh Celebrates Marriage  Bliss with Seema Chahal - Sangri Times
జిల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కబీర్ తన నటనతో లుక్స్ తో అందరిని ఫిదా అయ్యేలా చేశారు. అలా ఎన్నో చిత్రాలు నటించిన కబీర్ తాజాగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడంతో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కబీర్ సింగ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కబీర్ భార్య గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.. మరి కబీర్ సింగ్ రాబోయే రోజుల్లో ఎలాంటి చిత్రాలలో నటిస్తారేమో చూడాలి మరి.