మహేష్ కొన్న ఈ లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. మహేష్ బాబు ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ఒక రేంజ్ రోవర్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహేష్ బాబు ఒక్కో చిత్రానికి రూ .80 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పలు రకాల యాడ్స్ ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే సంపాదిస్తున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మహేష్ బాబు కు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టమట. అతడి గ్యారేజీలో ఇప్పటికే చాలానే కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే గ్యారేజ్ లోకి గోల్డెన్ కలర్ రేంజ్ రోవర్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

ఈ కారు ధర తెలిసి అందరూ నోరు ఎలా పెడుతున్నారు దాదాపుగా దీని ధర రూ.5.4 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. Sv కళ్ళు చెదిరే లుక్కుతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ కార్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ లాల్ ,సల్మాన్ ఖాన్ తదితర హీరోలకు సైతం రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయట .వీటిలో రేంజ్ రోవర్ ఎస్ వి సూపర్ గా ఇప్పుడు లేటెస్ట్ మోడల్గా హైదరాబాదులోకి రావడంతో మహేష్ బాబు ఈ కారును కొన్నట్టు తెలుస్తోంది. ఇండియాలో అత్యధికంగా ఫీల్ అవుతున్న కార్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.