బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. పైగా విడుదలైన నాటి నుంచి ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఓం రౌత్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు.
రామాయణంలోని ప్రధాన పాత్రలను దర్శకుడు ఓం రౌత్ చూపిన తీరుపై ఎక్కువ మేర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా రావణాసురిడి పాత్ర ను చూపించిన విధానంపై ఎందరో మండిపడ్డారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని మరోసారి ఓం రౌత్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలవకుశ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో `రావణసురి` పాత్ర గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురుడి భక్తుడిగా, ఆయనను పోలిన స్వభావం కలిగిన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రావణాసురుడి గురించి ఎన్టీఆర్ ఎంతో రీసెర్చ్ చేశారు. అంతేకాదు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రావణాసురుడి గొప్పతననని ఎంతో చక్కగా వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ కు ఉన్న నాలెడ్జ్ కూడా ఓం రౌత్‌కు లేదు అంటూ మరోసారి `ఆదిపురుష్` డైరెక్టర్ ను ఏకేస్తున్నారు.
https://twitter.com/NTRNarasimha_/status/1670623791649816577?s=20