గుడ్ న్యూస్‌.. వ‌రుణ్ తేజ్ బాట‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ర‌ష్మిక‌తో త్వ‌రలోనే ఎంగేజ్మెంట్!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే సొట్ట‌బుగ్గుల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠితో ఏడ‌డుగులు వేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎప్ప‌టి నుంచో వీరు ల‌వ్ లో ఉన్నా.. ఎక్క‌డా కూడా వీరిద్ద‌రూ ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. మ‌రికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవ‌లె వీరిద్ద‌రి ఎంగేజ్మెంట్ కూడా వైభ‌వంగా జ‌రిగింది.

అయితే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ బాట‌లోనే టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా వెళ్ల‌బోతున్నాడ‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్రేమ‌లో ఉన్నార‌ని ఎప్ప‌టి నుంచో టాక్ ఉంది. పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, విజ‌య్‌-ర‌ష్మిక మాత్రం మేమిద్దరం స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగేస్తున్నారు. జంట‌గా వెకేష‌న్స్ కు వెళ్తున్నారు.

తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రూ జంట‌గా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఒక కేఫ్‌లో వీరిద్ద‌రూ కనపడటం చర్చనీయాంశంగా మారింది. ర‌ష్మిక‌, విజ‌య్ డేటింగ్ లో ఉన్నారా? అంటూ మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఇదే స‌మ‌యంలో ఓ గుడ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ర‌ష్మిక‌తో ఏడ‌డుగులు వేసేందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ సిద్ధం అవుతున్నాడ‌ట‌. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబ‌స‌భ్యులు ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. పెళ్లిపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌లో ఎంగేజ్మెంట్ చేసుకుని.. వ‌చ్చే ఏడాది గ్రాండ్ గా వివాహం చేసుకోవాల‌ని విజ‌య్‌, ర‌ష్మిక డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది.