త్వరలో పెళ్లి పీటలేకపోతున్న లేడీ కమెడియన్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన విజయ్ దళపతి నటించిన చిత్రాలలో బిగిల్ చిత్రం కూడా ఒకటీ ..ఈ సినిమా తెలుగులో విజిల్ అనే పేరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్గా నటించాగ ఈ సినిమాలో విజయ్ ఉమెన్స్ టీం కోచ్ గా కనిపిస్తారు మహిళలు ఫుట్ బాల్ టీం లో ప్రముఖ నటిమనులు కూడా నటించడం జరిగింది. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఇంద్రజ అని చెప్పవచ్చు..

Bigil fame Indraja Shankar viral photoshoot picture new look

అయితే ఇంద్రజ పేరు వినగానే గుర్తుపట్టకపోయినా ఇందులో గుండమ్మ అంటే గుర్తుపట్టేస్తూ ఉంటారు. అంతలా ఈ పాత్రలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తమిళనాడు అయితే ఫుట్ బాల్ పాండియమ్మ పాత్ర పేరు బాగా పాపులర్ అయింది. విజిల్ తర్వాత ఒక సోలో పాల్గొంది ఇంద్రజ ఆ తర్వాత కార్తి వీరు మాన్ సహా పలు సినిమాలలో నటించింది. దీంతో తమిళనాడులో టాలెంటెడ్ కమెడియన్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం చేతునిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈమె తాజాగా ఒక శుభవార్తను తెలియజేసింది.

తాను తన జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నానని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఇంద్రజ తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. ఇంద్రజను వివాహం చేసుకోబోయేది ఎవరో కాదు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న డైరెక్టర్ శంకర్ తోని అన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తన కాబోయే భర్తతో ఇంద్రజ దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు నేటిజెన్లు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పెళ్లికి సంబంధించిన విషయాలను ఇంకా తెలియజేయడం లేదు.