చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలెన్నో తెలుసా..?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా స్టార్ హీరోగా ఎదిగారని చెప్పవచ్చు. చిరంజీవి కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాలు కూడా ఉన్నాయి. తన పేరు మీదే మరెన్నో రికార్డులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.. చిరంజీవి ఇప్పటివరకు 154 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇందులో 150 కు పైగా సినిమాలలో హీరోగాని నటించారు చిరంజీవి. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు. అయితే ఇన్ని సినిమాలలో నటించిన చిరంజీవి ఖాతాలో ఆగిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయట వాటి గురించి తెలుసుకుందాం.

Chiranjeevi birthday: Fans bombard social media with GodFather star viral  pics & videos to celebrate | Trending News – India TV

సంగీతం శ్రీనివాస్ చిరంజీవితో కలిసి భూలోక వీరుడు అనే జానపద చిత్రాన్ని మొదలుపెట్టారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో ప్లాన్ చేయగా కొన్ని రోజులు షూటింగ్ చేసి వదిలేయడం జరిగింది. మరొక సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వినాలని ఉంది అంటూ ఒక సినిమాని కూడా మొదలుపెట్టారు.. టబు, ఊర్మిళ ఇందులో హీరోయిన్లుగా ఎంపికయ్యారు ఈ సినిమాలోని రెండు పాత్రలు కూడా చిత్రీకరించడం జరిగింది కానీ ఆ తర్వాత ఆగిపోయింది.

ఇక చిరంజీవిని హాలీవుడ్ రేంజ్ లో చూపించాలని ఆబూ బాగ్దాద్ గజదొంగ సినిమాని చాలా గ్రాండ్గా మొదలుపెట్టారు. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు ఈ సినిమాని సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. మరొక చిత్ర చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో డైరెక్టర్ కోదండ రామిరెడ్డి దర్శకుడుగా వజ్రాల దొంగ అనే సినిమాని మొదలుపెట్టారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి కానీ కొన్ని కారణాల చేత ఆగిపోయింది. డైరెక్టర్ విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా కానీ ఎందుకో ఈ సినిమా మొదలు కాలేదు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ అనే సినిమా కూడా ఆగిపోయింది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.