`భ‌గ‌వంత్ కేస‌రి` నుంచి బ‌య‌ట‌కొచ్చిన కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్‌.. ఇంత‌కీ ఆమె రోల్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బ‌ర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ వెలువెత్తుతున్నాయి. సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు కాజ‌ల్ బర్త్‌డే సందర్భంగా `భగవంత్‌ కేసరి` మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల అయింది. నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది.

ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ కీలక పాత్రను పోషిస్తుంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్ బ్యానర్ పై సాహో గారపాటి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి బయట‌కి వచ్చిన కాజ‌ల్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. క్లాసీ లుక్ లో అంతగా దర్శనమిచ్చిన కాజల్.. ఒక చేతిలో బుక్‌ పట్టుకుని, మరో చేతిలో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది.

ఇక ఈ పోస్టర్ ఆధారంగా చూస్తే భాగవంత్‌ కేసరిలో కాసల్ లెక్చరర్ పాత్రలో కనిపించపోతుందని చ‌ర్చించుకుంటున్నారు. కాగా, కాజ‌ల్ మరోవైపు `సత్యభామ` అనే లేడీ ఓరియంటెడ్ మూవీకి కమిట్ అయింది. కోలీవుడ్ లో కమల్ హాసన్ కి జోడీగా `ఇండియన్ 2` సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నాయి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కాజ‌ల్‌ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో య‌మా జోరు చూపిస్తోంది.