ఎంగేజ్మెంట్ అయినా స‌రే ఆ ప‌నికి `నో` అంటున్న వ‌రుణ్‌.. బాగా హ‌ర్ట్‌ అవుతున్న లావ‌ణ్య‌!?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే నాగబాబు నివాసంలో వైభవంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

ఈ ఏడాది చివ‌ర్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్నార‌ని అంటున్నారు. త్వరలో ఒకటి కాబోతున్న ఈ జంటను ఇంట‌ర్వ్యూ చేసేందుకు కొన్ని ఛానెల్స్ వెంబడిస్తున్నాయ‌ట‌. అయితే అందుకు వ‌రుణ్‌ తేజ్ మాత్రం నో చెబుతున్నాడ‌ట‌. లావ‌ణ్య మాత్రం కాబోయే భ‌ర్త‌తో ఇంట‌ర్వ్యూల్లో పాల్గొనాల‌ని చాలా ఉత్సాహం చూపుతుంద‌ట‌.

కానీ, పెళ్లికి ముందే ఇవ‌న్నీ ఎందుక‌ని వ‌రుణ్ తేజ్ వెన‌క్కి త‌గ్గుతున్నాడ‌ట‌. దాంతో లావ‌ణ్య బాగా హ‌ర్ట్ అవుతుంద‌ని ఇన్ సైడ్ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బేసిక్ గా వరుణ్ తేజ్ చాలా సిగ్గరి. ఎంతో మెహమాటంగా మాట్లాడుతుంటారు. అలాంటి వరుణ్ ని ప్రేమ విషయాలు చెప్పమంటే ఇంకా బాగా ఇబ్బంది ప‌డ‌తాడు. అందుకే ఎంగేజ్మెంట్ అయినా స‌రే లావ‌ణ్య‌తో క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌మంటే నో చెబుతున్నాడ‌ట‌. కాగా, వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం `గాందీవధారి అర్జునుడు` అనే మూవీ చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రోవైపు లావ‌ణ్య సైతం వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.