చిరంజీవితో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన సుధాకర్..!!

టాలీవుడ్లో టాప్ కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో సుధాకర్ కూడా ఒకరు .అప్పట్లో సుధాకర్ లేని చిత్రాలు ఉండేవి కావు.. స్టార్ నిర్మాతలు హీరోలు సైతం సుధాకర్ డేట్లు కోసం అడ్జస్ట్ చేసుకునే వారిని వార్తలు వినిపిస్తూ ఉండేది. చిరంజీవి దగ్గరనుంచి మహేష్ బాబు వరకు ఎంత మంది స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ సుధాకర్ ప్రస్తుతం ఆయన వయసు 64 సంవత్సరాలు కావడంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. గతంలో తన పైన ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ వాటిపైన స్పందించడం జరిగింది. అయితే తాజాగా సుధాకర్ ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా స్టార్ హీరోల గురించి సుధాకర్ చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్, జగపతిబాబు, నాగార్జున తదితర స్టార్ హీరోలతో పనిచేశారు కదా వారి గురించి చెప్పండి అన్న ప్రశ్నకు సుధాకర్ ఇలా సమాధానాన్ని తెలియజేశారు
.

సుధాకర్ మాట్లాడుతూ.. జగపతిబాబుకు ఎలాంటి డ్రెస్సు వేసుకోవాలో ఎలాంటి డ్రెస్ బాగుంటుందో చెబుతూ ఉండేవాడిని ఆయన కచ్చితంగా వాటిని పాటించేవారని తెలిపారు.. వెంకటేష్ కైతే కాల్ చేసి ఎక్కడ తింటున్నావ్ సుధాకర్ ఏ ఫుడ్ తింటున్నామని అడిగే వారిని సెట్లో ఉన్నంత సేపు నేను కనిపించకపోతే అడిగే వారిని తెలిపారు..ఇక చిరంజీవి గారితో మీకు గొడవలు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానంగా.. సినిమాలలో నటించకు ముందు మేము ఇద్దరం ఒకే రూములో ఉండేవాళ్ళ ఆ తర్వాత ఎవరి ఇళ్లల్లో వారు ఉన్నాము.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు కనీసం ఎలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడగకండి అంటూ తెలియజేశారు సుధాకర్. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.