టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కేవలం గుంటూరు కారం అనే సినిమా మాత్రమే ఉన్నది. అయితే ఈ సినిమా నుంచి కూడా పూజా హెగ్డే ను తప్పించారనే వార్తలు నిన్నటి నుంచి వైరల్ గా మారుతున్నాయి.
గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ పూజ హెగ్డేను తీసుకున్నారు కానీ రీసెంట్గా ఈమెను ఈ చిత్రం నుంచి తప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం త్రివిక్రమ్ పూజ హెగ్డే మధ్య ఉన్న లవ్ బ్రేకప్ అయిందనే వార్తలు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ మరొక హీరోయిన్ సంయుక్త మీనన్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆమెతో రిలేషన్ లో ఉన్నారని టాక్ కూడా వినిపిస్తున్నాయి.
ఈమె మీద మోజు వల్లే త్రివిక్రమ్ పూజ హెగ్డే ను దూరం పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పూజా హెగ్డే కూడా గుంటూరు కారం సినిమా నుంచి తప్పించినట్లు సోషల్ మీడియాలో పలు రూమర్లు వైరల్ గా మారుతున్నాయి. మరి గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ఉందా లేదా అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. గతంలో కూడా పూజా హెగ్డే త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.