అదే నిజం అయితే .. సినీ ఇండస్ట్రీలో మరో బిగ్ డివర్స్ కన్ఫామేనా..? ఏంట్రా బాబు ఇలా తయారైయారు..!!

గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పేర్లు ఏ రేంజ్ లో హంగామా చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జూన్ 9న వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకొని జంటగా మారబోతున్నారు అనే న్యూస్ మారుమ్రోగిపోతుంది . ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వని మెగా ఫ్యామిలీ ఈ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నా కానీ నోరు విప్పట్లేదు . దీంతో మెగా అభిమానులు సైతం ఈ వార్త నిజమే అంటూ నమ్మేస్తున్నారు . అయితే ముఖానికి రంగులు పూసుకునే అమ్మాయిని చిరంజీవి ఇంటి కోడలుగా తెచ్చుకుంటున్నారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది .

మనం గమనించినట్లయితే మెగా ఫ్యామిలీలో ముఖానికి రంగులు పూసుకుని వచ్చిన కోడలు డిజాస్టర్ గా మారుతున్నారు. చిరంజీవి భార్య సురేఖ , నాగబాబు భార్య పద్మ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. వాళ్లు తెరపై కనిపించింది లేదు . అందుకే వాళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉన్నాయని.. రేణు దేశాయ్ ముఖానికి రంగులు పూసుకునే హీరోయిన్ కావడంతో గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చి మెగా ఫ్యామిలీలో ఇమడలేక డివోర్స్ తీసుకుంది అని వార్తలు వినిపించాయి .

ఇన్ని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి – వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకుంటాను.. అంటే ఎలా ఒప్పుకున్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. రీసెంట్గా నిహారిక సైతం చైతన్యతో ఇమిడి పోలేక డివోర్స్ తీసుకోవాలనుకుంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . ఇవన్నీ చూసి కూడా మెగా ఫ్యామిలీ ఓ హీరోయిన్ ని ఇంటికి కోడలుగా తెచ్చుకోబోతుందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు ఏం మటుకు కాపురం అటు ఇటు అయినా కచ్చితంగా లావణ్య వరుణ్ కూడా డివర్స్ తీసుకుంటారు అని జోష్యం చెప్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఇంకా వాళ్ల పెళ్లి డేట్ రాలేదు.. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. .మీరు అప్పుడే విడాకుల వరకు వెళ్లిపోయారా ..? అంటూ తలలు బాదుకుంటున్నారు. చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?