ఆ పని చేయలేదని స్టార్ హీరో సినిమా నుంచి తీసేసారు డింపుల్ హయాతి హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డస్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ డింపుల్ హయాతి.. గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందులో నటించింది కేవలం మూడు నిమిషాలే అయిన కుర్రకారులను తన అందచందాలతో బాగా కిక్కెక్కించిందని చెప్పవచ్చు. ఖలాడి సినిమాతో ఇండస్ట్రీ చీకు తనవైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కూడా తన గ్లామర్ తో హాట్ షేపులతో అందరిని ఆకట్టుకుంది.

Picture 1860689 | Dimple Hayathi Latest Photos

ఇటీవలే రామబాణం సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే ..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా ఈమె జిమ్ వర్కౌట్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇది చూసిన నేటిజెన్లు సైతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అంత కఠినంగా వర్కౌట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. జిమ్ ట్రైనర్ అయిన ఒక వ్యక్తి డింపుల్ హయాతి కింద పడుకొని ఉంటే ఆమె పొట్ట పైన ఎక్కి నిలుచున్నారు.

ఇలాంటివన్నీ భరిస్తూ జిమ్ములో మరిన్ని కఠినమైన ఎక్సర్సైజులు చేస్తోంది డింపుల్ హయాతి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలు మాట్లాడుతూ గద్దల కొండ గణేష్ సినిమా హీరోయిన్ క్యారెక్టర్ తానే చేయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఒక పెద్ద డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అయ్యాను.. కాల్ సీట్లు అడ్జస్ట్ చేయలేక గద్దల కొండ గణేష్ సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. స్టార్ డైరెక్టర్ తో దాదాపుగా 90% షూటింగ్ పూర్తి అయ్యాక ఆగిపోయింది కేవలం డాన్స్ రాలేదని చెప్పి తనని ఆ సినిమా నుంచి తప్పించారని.. ఆ విషయం తనని ఇప్పటికి బాధేస్తోందని తెలిపారు.ఆ సమయంలోన డైరెక్టర్ హరీష్ శంకర్ ఫోన్ చేసి తన సినిమాలు స్పెషల్ సాంగ్ ఉంది చేస్తారా అని అడగగా ఒప్పుకున్నారని ఆ పాట తన కెరీర్ కు ప్రాణం పోసిందని తెలిపింది.