ప్రమాదం నుంచి బయటపడ్డ కమెడియన్ ఆలీ కుటుంబం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలీ.. ఎన్నో చిత్రాలలో హీరోగా కమెడియన్గా నటించిన ఆలీ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు.. రాజకీయాల పరంగా కూడా యాక్టివ్ గా ఉన్న ఆలీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించారు. చైల్డ్ యాక్టర్ గా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించిన అలి ఎన్నో టాక్ షోలతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఆలీ ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు..

ఆలీ భార్య ఆయన పిల్లల గురించి కూడా అందరికీ తెలిసిందే రీసెంట్గా ఆలీ కూతురు వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది.ఇదంతా ఇలా ఉంటే ఆలీ కుటుంబం ప్రమాదం నుంచి బయట పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ ఛానల్ ని కొనసాగిస్తోంది. తాజాగా తన చానల్స్ లో తాము ప్రమాదం నుంచి బయటపడిన విషయాన్ని కూడా తెలియజేసింది.. ఆలీ కూతురు ఫాతిమా ఇటీవల అమెరికా నుంచి రావడం జరిగింది ఇదే సమయంలో ఆమె అత్తమామలు కూడా రావడంతో అంతా కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారట.

ఈ క్రమంలోనే అంతా కూడా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో వెళ్లాలని భావించడంతో భారీ వర్షం కారణంగా వారి ఎక్కిన ఫ్లైట్ ప్రమాదంలో చిక్కుకుందట. దీంతో ఒక్కసారిగా ఫ్లైట్లో ఉన్న వారంతా గుండె ఆగినంత పని అయిందని తెలియజేశారు. ఆ తర్వాత అరగంట తర్వాత విమానం సేఫ్ లాండింగ్ అవ్వడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నామంటూ యూట్యూబ్ ద్వారా తెలియజేశారు. ఆలీ ఫ్యామిలీ. ప్రస్తుతం ఆలీ ఫ్యామిలీకి సంబంధించి ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది.