`స‌మ‌ర‌సింహారెడ్డి` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ చేయ‌మ‌ని వెంట‌ప‌డితే ఛీ కొట్టిన హీరో ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో `స‌మ‌ర‌సింహారెడ్డి` ఒక‌టి. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిమ్రాన్‌, అంజలా జవేరి హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యాక్షనిజం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 1999లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

బాక్సాఫీస్ వ‌ద్ద కాస‌లు వ‌ర్షం కురిపించి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. మణిశర్మ అందించిన స్వ‌రాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అప్ప‌ట్లో ఈ చిత్రం రూ. 17 కోట్ల రేంజ్ లో షేర్ ను వ‌సూల్ చేసింది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. స‌మ‌ర‌సింహారెడ్డి మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ బాల‌య్య కాదు.

డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ చేయ‌మంటూ టాలీవుడ్ కి చెంద‌ని ఓ స్టార్ వెంట‌ప‌డితే.. స‌ద‌రు హీరో చేయ‌న‌ని ఛీ కొట్టాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు విక్ట‌రీ వెంక‌టేష్‌. స‌మ‌ర‌సింహారెడ్డి క‌థ మొద‌ట వెంకీ వ‌ద్ద‌కే వెళ్లింద‌ట‌. కానీ, తనకి ఇలాంటి సినిమాలు సూట్ అవ్వవు అని రిజెక్ట్ చేశాడ‌ట‌. అయినాస‌రే బీ.గోపాల్ మాత్రం వెంకీతోనే ఈ సినిమాను ప‌ట్టాలెక్కించాడ‌ని తెగ ప్ర‌య‌త్నించాడ‌ట‌. మీ ఇమేజి ని పూర్తిగా మార్చే చిత్రం గా నిలుస్తుంది, కచ్చితంగా మీకు సూట్ అవుతుంది చెయ్యండి అని వెంకీని ఎంత‌గానో బ్రతిమిలాడాడ‌ట‌. అయినా స‌రే వెంకీ చెయ్య‌ను పొమ్మ‌న్నాడ‌ట‌. దాంతో చివ‌ర‌కు బి.గోపాల్ బాల‌య్య‌తో `స‌మ‌ర‌సింహారెడ్డి`ని చేయ‌గా.. సినిమా ఘ‌న విజ‌యం సాధించింది.