ఎట్టకేలకు తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్..!

ఈ మధ్యకాలంలో అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై చాలామంది నటీనటులు , కమెడియన్లు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న హీరో శర్వానంద్ కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

వరంగల్ జిల్లాకు చెందిన కార్తిక్ అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. అక్కడ మిమిక్రీ ఆర్టిస్టుగా కొన్ని షోలకు తక్కువ పేమెంటుకే పనిచేసి 2015 లో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. కమెడియన్ గా పనిచేస్తూనే ఆ తర్వాత అవినాష్ కారణంగా 2016లో టీం లీడర్ గా మారి ఇప్పటికీ టీం లీడర్ గా కొనసాగుతూ తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే 2016లో అమెరికా, స్విజర్లాండ్ వంటి ప్రదేశాలు తిరిగి ఇప్పుడు జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . ప్రస్తుతం తనను మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ లాంటి స్టార్ సీనియర్ హీరోలు కూడా గుర్తు పడుతున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న వెనుక నుంచి తీసిన తన కాబోయే భార్య ఫోటో షేర్ చేసిన కార్తిక్.. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే ఆనందం రెట్టింపు అవుతుందని అన్నారు.. అది ఇదేనేమో.. నువ్వు నా జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది.. నీతో ఏడడుగులు వేయడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు . దీంతో అమ్మాయి ఎవరు అని నెటిజన్లు సైతం ఆరా తీయగా.. ఈరోజు అమ్మాయి ఫోటోని రివీల్ చేస్తూ తన పేరు సిరి అని ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పరిచయం చేశారు కార్తిక్. త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు ఈ జంట.

 

View this post on Instagram

 

A post shared by Kevvu Kartheek (@kevvukartheek)