“మిగతా హీరోలకు లేనిది ..నాకు ఉన్నది ఆ రెండే”.. స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కుర్ర హీరోలు ఉన్నా.. కొత్త హీరోలు పుట్టుకొస్తున్న ..ఇండస్ట్రీలో బాద్షా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్ . బాలీవుడ్ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో కొన్ని దశాబ్దాలుగా షారుక్ ఖాన్ ఏలేస్తున్నాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీతో దూసుకుపోతున్న షారుక్ ఖాన్.. రీసెంట్ గానే పఠాన్ అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ చిత్రం కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఏకంగా పరువు పోతున్న బాలీవుడ్ స్థాయిని పైకి తీసుకెళ్లింది . 1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి టాప్ సినిమాగా నిలిచింది . కాగా ప్రెసెంట్ షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో “జవాన్” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తుంది. తాజాగా షారుక్ ఖాన్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వగా.. పలు ఆసక్తికర కమెంట్స్ చేశారు.

అందులో ఓ నెటిజన్ షారుఖ్ ఖాన్ ను “ఇతర హీరోల దగ్గర లేనివి..? మీ దగ్గర ఉన్నవి..? ఏంటి..?” అంటూ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగాడు . అయితే షారుక్ ఖాన్.. దానికి ఏమాత్రం మొహమాట పడకుండా బదులు ఇస్తూ..”నా దగ్గర దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, స్వదేశ్, చక్ దే ఇండియా, ఓం శాంతి ఓం, పఠాన్.. చిత్రాలు ఉన్నాయి” అంటూ చెప్పుకొస్తూ ఇలాంటి ప్రశ్నలు అడగడం ఇక ఆపండి అంటూ ఆ నెటిజెన్ కి కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో షారుక్ ఖాన్ మైండ్ స్టాటజీకి ఫిదా అయిపోయారు జనాలు. ఊరికే కాదు నిన్ను బాద్షా అనేది అంటూ ఆయన పేరు ను ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!