“నా కెరీర్ లో పరమచెత్త సినిమా అదే”.. పేరుతో సహా బయటపెట్టేసిన పూజా హెగ్డే ..ఏం డేర్ రా బాబు..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో మనకు బాగా తెలిసిన విషయమే. ఒకప్పుడు పూజ హెగ్డే పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు. అమ్మడు అంత చందాలకి మెల్ట్ అయిపోయి టెంప్ట్ అయిపోయేవారు . అయితే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది . పూజ పేరు చెప్తే జనాలు పరిగెత్తేస్తున్నారు. వద్దురా బాబోయ్ మాకు ఈ హీరోయిన్ వద్దు అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ వరుసగా బ్యాక్ టూ బ్యాక్ ఐదు బడా సినిమాలను డిజాస్టర్లుగా తన ఖాతాలో వేసుకోవడమే అంటూ తెలుస్తుంది.

కాగా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాతనే పూజా హెగ్డే పరువు ఇలా దారుణంగా దిగజారిపోయింది అంటూ పలువురు తెలుగు జనాలు ట్రోల్ చేస్తున్నారు. కాగా గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూజా హెగ్డే తన సినిమాలలో తనకు పరమ చెత్తగా నచ్చిన సినిమా ఏది అంటే ఓపెన్ గా సినిమా పేరును కూడా చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ప్రజెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న పూజ గతంలో “మొహెంజో దారో” అనే సినిమాలో నటించింది .

హృతిక్ రోషన్కు పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా అశుతోష్ గోవారికర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హిందీలో పూజా హెగ్డే చేసిన తొలి సినిమా ఇది. యు టీవీ మోషన్ పిక్చర్స్, అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై నిర్మిత‌మైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తా కొట్టింది. కాగా ఈ సినిమా పరమ చెత్తను సొంతం చేసుకుంది . అంతేకాదు పూజ హెగ్డేకు సైతం ఈ సినిమా నచ్చలేదట . కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఒక లాగా తెరకెక్కించేటప్పుడు మరోలా చేశాడు అంటూ మండిపడింది. అందుకే తన కెరీర్లు బిగ్గెస్ట్ తప్పు చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే “మొహెంజో దారో” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో పూజ హెగ్డే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!