కత్తి లాంటి ఫిగర్ ఉన్న త్రిష ..తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదో తెలుసా..?

చెన్నై చంద్రంగా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇప్పటికి ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటూ టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . దీని అంతటికి కారణం ఆమెకున్న అందం .. మొదటి రీజనయితే రెండోది ఆమె టాలెంట్ ..

కాగా రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ ద్వారా ఆమె పేరు మరింత పాపులారిటీతో సంపాదించుకుంది . ఈ సినిమాలో అమ్మడు అచ్చం కుందనపు బొమ్మలాగే కనిపించింది . ఎవరైనా చూస్తే త్రిష పదహారేళ్ల అమ్మాయి అని అనుకుంటారు . అంత చక్కగా కనిపించింది . ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత అందం ఆమె సొంతమైంది . కాగా తమిళ్లో వరుస సినిమాలకు కమిట్ అవుతున్న త్రిష ఎందుకు తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

అయితే త్రిష కూడా తెలుగులో సినిమాలు చేయడానికి రెడీగా ఉందట . కాకపోతే ఆమెకు నచ్చిన కంటెంట్ డైరెక్టర్ ఇవ్వట్లేదు అంట ..అన్ని బోల్డ్ రోల్స్ ఇస్తున్నారట. గ్లామర్ రోల్స్ ఇస్తున్నారు తప్పిస్తే ఎక్కడా కూడా ఆమెకు నటనపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇవ్వట్లేదు. అందుకే త్రిష తెలుగు సినిమాలు చేయట్లేదని కచ్చితంగా మంచి అవకాశం వస్తే చేస్తుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

Share post:

Latest