సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని సార్లు ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి. పొరపాటున టంగ్ స్లిప్ అయినా మాట తూలినా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది . ప్రెసెంట్ అలాంటి హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది బేబ్బమ్మ గా పాపులారిటి సంపాదించుకున్న కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత తన సినిమాలు ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
రీసెంట్ గా కస్టడీ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంత్స్ చేసింది . “ఊ అంటావ మావ ఆఫర్ నాకు వస్తే చేయనని బోల్డ్ గా స్పందించింది”. ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు . ఇప్పుడు మాట చెప్పడం కాదు ఆ తర్వాత ఆ మాట మీద నిలబడాలి.
“ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ నీలాగే మాట చెప్పారు.. కీర్తి సురేష్ అయితే నేను ఎక్స్పోజింగ్ చేయను బోల్డ్ కంటెంట్ ఇవ్వను అనింది ..సర్కార్ వారి పాట తర్వాత కీర్తి ఎలా మారిపోయిందో నువ్వే చూసావు .. నువ్వు ఇండస్ట్రీలో ఇప్పుడు పద్ధతిగా రోల్స్ చేస్తున్నావు ..రానున్న రోజుల్లో నీ టైం బాగోలేకపోతే ఎక్స్పోజింగ్ చేయాలి.. ఐటమ్ సాంగ్ కూడా చేయాల్సి వస్తుంది. అలా అని ఇప్పుడు వేరే హీరోయిన్ చేసిన సాంగ్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం పద్ధతి కాదు కృతి “అంటూ సమంత ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు . దీంతో కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కొందరు కృతి కి నేరుగా ఇచ్చి పడేస్తున్నారు.. స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు..!!