ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉంటే..అనసూయ – విజయ్ దేవరకొండనే ఎందుకు కెలుకుతుందో తెలుసా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో అనసూయ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూసింత సైలెంట్ గానే ఉంటూ వచ్చింది . జబర్దస్త్ ఏనాడైతే మానేసిందో అప్పటినుంచి అనసూయ టంగ్ కంట్రోల్లో పెట్టుకుంటూ జాగ్రత్తగానే మాట్లాడుతూ వచ్చింది. అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా అనసూయలోని మరో వైల్డ్ యాంగిల్ ను బయటపెట్టింది అంటున్నారు జనాలు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది .

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “ఖుషి” పోస్టర్ ని రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ను “ది విజయ్ దేవరకొండ” అంటూ మెన్షన్ చేశారు . అయితే అనసూయ..” అయ్య బాబోయ్ ..ఇప్పుడే ఒకటి చూశాను ..దీ నా.. ఏంట్రా బాబు ఈ పైత్యం ” అనే విధంగా పరోక్షకంగా విజయ్ దేవరకొండకు కౌంటర్ వేసింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

 

అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండగా కేవలం అనసూయ ఎందుకు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే అనసూయ క్రేజ్ పెరగాలి అంటే క్రేజ్ ఉన్న హీరోని టార్గెట్ చేయాలి అని ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అందరికీ తెలిసిందే అని ..ఈ క్రమంలోనే విజయ్ సైలెంట్ గా ఉన్న అనసూయ ని కావాలని ఆయనని కెలుకుతూ మ్యాటర్ ని మరింత సీరియస్ చేస్తుంది అని ..విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అనసూయ పేరుని ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

Share post:

Latest