ఖాకీ దుస్తుల్లో తెలుగు హీరోలు.. త్వరలో రానున్న సినిమాలివే..

ఖాకీ కథలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఖాకి సినిమా రిలీజ్ అయిన కూడా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. కుర్ర హీరో లు పోలీస్ యూనిఫామ్ వేసుకొని యాక్షన్ డోస్ పెంచి మరీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్స్ లో పోలీస్ కథలే ఉండటం గమనార్హం. అందుకే హీరోలు ఎక్కువగా పోలీసు దుస్తులు వేసుకొని సినిమాలో కనిపించాలని ఆశ పడుతుంటారు. ఇప్పుడు ఉన్న హీరోలు కూడా ఖాకీ కథలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ కథలతో ప్రేక్షకులకు అలరించడానికి వస్తున్న సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• కస్టడీ:

 

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ సినిమాతో మొదటిసారి ఖాకీ యూనిఫామ్‌లో కనిపించబోతున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో శివ అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య నటించాడు. ఒక కిల్లర్‌ని కోర్ట్‌కు తీసుకుళ్లే క్రమంలో కానిస్టేబుల్‌కి ఎదురైన సంఘటనల గురించి ఈ కథ తిరుగుతుంది. కస్టడీ సినిమాలో ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించునున్నారు.

• హిట్ 3

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ -3 సినిమాలో నేచరల్ స్టార్ నాని కూడా మొదటి సారి పోలీస్ గా కనిపించబోతున్నాడు. అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన హిట్ 2 సినిమా లాస్ట్‌లో నాని లుక్ ని రివిల్ చేసి హిట్ 3 పై ఎక్కువ అంచనాలు పెంచేసారు దర్శకుడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లానుంది.

• ఉగ్రం

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అల్లరి నరేష్ ఉగ్రం సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంటుంది. త్వరలోనే విజయ్ దేవరకొండ కూడా ఖాకీ యూనిఫామ్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.