అనన్య నాగళ్ల.. ఈ ముద్దగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాల ద్వారా అనన్య తెలుగు ప్రేక్షకులకు బాగానే చేరువైంది.
రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ప్రేమ కావ్యం `శాకుంతలం`లోనూ మెరిసింది.
అయితే ఆకట్టుకునే అందం, అంతకు మించి నటనా ప్రభతి ఉన్నా.. అనన్య హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.
సైడ్ క్యారెక్టర్లే తప్ప హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇకపోతే సోషల్ మీడియాలో అనన్య యమా యాక్టివ్ ఉంటుంది. అందాలతో ఆఫర్లు అందుకునేందుకు అనన్య గట్టిగా ప్రయత్నిస్తోంది.
తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా మరోసారి స్కిన్ షో చేసింది. వైట్ శారీలో భూలోక అప్సరసలా దర్శనమిచ్చింది.
తడిసిన అందాలతో అల్లాడించేసింది. నాజూకు నడుము సొగసులను చూపిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం అనన్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.