తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నా అదృష్టం కలిసి రాక సరైన స్టార్‌డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గోపీచంద్ కూడా ఒకరు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా గోపీకి రావాల్సిన ఫలితం అయితే రాలేదు. కారణం తెలియదు కానీ సినిమాలతో ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు గోపీచంద్ కెరీర్లో ఎప్పుడూ లేవు. తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాలో గోపీచంద్ నటన చాలామందికి నచ్చింది. సైలెంట్ లుక్స్ తో రాముడు మంచి బాలుడు అనే టైపులో నటించాడు . సినిమాలోనే కాదు బయట ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అదే. గోపీచంద్ చాలా సైలెంట్.. ఎవ్వరి జోలికి వెళ్లడు. తన జోలికి వచ్చినా పట్టించుకోడు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు అన్ని తెలిసినా కానీ సైలెంట్ గా ఉంటాడు. అది తప్పో ఒప్పో ఆయనకే తెలియాలి. అయితే మంచి హైట్ -వెయిట్- ఫిజిక్ .. ఆ కటౌట్ చూసి టెంప్ట్ అయిపోయే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు .
కానీ మనోడు టెంప్ట్ అవ్వడట గోపీచంద్ లో రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా తక్కువ. సినిమా పరంగా ఏదైనా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయమంటే సిగ్గుపడతాడట. భయపడిపోతాడట. హీరోయిన్ టచ్ చేయడానికి కూడా పది సార్లు ఆలోచిస్తాడట. మరి అలాంటి హీరో ఇండస్ట్రీలో నెట్టుకు రాగలడా..? అసలు హీరోయిన్ సెంటీమీటర్ చనువు ఇస్తే కిలోమీటర్ దూసుకుపోయే హీరోలు ఉన్న ఈ కాలంలో అమ్మడు సిగ్నల్ ఇచ్చినా అర్థం చేసుకోలేని గోపీచంద్ అందుకే స్టార్ హీరో కాలేకపోయాడు అంటున్నారు జనాలు.
అంతేకాదు ఇప్పటివరకు మనం గోపీచంద్ నటించిన సినిమాలు చూస్తే రొమాంటిక్ సీన్స్ లో గోపీచంద్ ఎంత ఇబ్బందికరంగా నటించాడో స్క్రీన్ పై క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం సినిమాతో మరోసారి ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రియల్ లైఫ్ లో సైలెంట్ బాయ్ గా ఉన్న గోపీచంద్ రియల్ లైఫ్ లో మాత్రం రొమాంటిక్ బాయ్ ఇద్దరు పిల్లలతో మంచి వైఫ్ తో ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.