తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గురించి మొన్నటి వరకు ఎంతో చర్చ నడిచింది. ఆస్కార్ అవార్డు తీసుకురావడంలో రాజమౌళి చేసినకృషి అంతా ఇంతా కాదు. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారన్న విమర్శలు అతే వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లిన ఆయనను విమర్శించిన వారి కంటే మెచ్చుకున్నవారే ఎక్కువగా ఉన్నారు.
ఈ తరుణంలో రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రాజమౌళిపై ప్రేక్షకులు ఏ స్థాయిలో ? పాజిటివ్ గా కామెంట్ చేస్తారో నెగిటివ్ కామెంట్లు సైతం అదే విధంగా చేస్తారు. రాజమౌళి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఎక్కువ మొత్తం ఆర్థిక సహాయం చేయరని విమర్శ ఉంది. ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టరని కొంతమంది అంటారు.
అయితే ఆయన ఎంటో తెలిసిన్న వారు మాత్రం మరో విధంగా చేబుతారు. రాజమౌళి ఎంతోమందికి తన వంతు సహాయం చేసారు. నిజంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి జక్కన్న అస్సలు వెనుకడుగు వేయరు. ఆ సహాయలను ప్రచారం చేసకోరు. అలా ప్రచారం చేస్తే అవసరం లేని వారు సైతం రాజమౌళి వెంట పడుతారని చెబుతున్నారు.
అందువల్ల రాజమౌళి సాయం విషయంలోకొంత కఠినంగా ఉంటారని అన్నారు. అయితే తాను తీసే సినిమాతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా సినీ కార్మికులకు 3 సంవత్సరాల పాటు పని ఉంటుందని, ఇది కూడా ఓ విధంగా సాయం చేయడమే అయన అభిమానులు అంటున్నారు.