తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన హీరోల్లో ఉదయ్‌కిరణ్ ఒకరు.చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ కేరీర్ ఎన్నో మలుపులు తిరిగింది.హీరోగా వచ్చిన కొత్తలోనే వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు ఉదయ్‌కిరణ్. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత అదృష్టం ఆయనను వరించింది మంచి అవకాశాలు వచ్చాయి. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లో ఉదయ్ కిరణ్ పేరు చెప్తే కాలేజీ అమ్మాయిలు ఓ రేంజ్ లో ఊగిపోయేవాళ్ళు. కాగా ఉదయ్ కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మనసంతా నువ్వే కూడా ఆయన క్రేజ్ డబుల్ చేసింది. ఈ సినిమా కంటే ముందు ఉదయ్ కిరణ్ చిత్రం, నువ్వు నేను వంటి సూపర్ హిట్ సినిమాలో నటించాడు.
అయితే నిజానికి మనసంతా నువ్వే సినిమాలో హీరోగా అనుకునింది వేరే టాలీవుడ్ హీరో నట. ఈ సినిమాను మహేష్ బాబు తో చేయాలని సినిమా డైరెక్టర్ అనుకున్నారట అయితే డైరెక్టర్ ఆదిత్య స్టోరీని మొదటిగా మహేష్ బాబుతో చేద్దామని అనుకొని కథ చెప్పగా మహేష్ బాబుకు కథ పెద్దగా నచ్చకపోవడంతో సింపుల్‌గా రిజెక్ట్ చేశారట. దాంతో ఈ సినిమా స్టోరీని ఇద్దరు ముగ్గురు హీరోలకి చెప్పినా వారు పెద్దగా అట్రాక్ట్ అవ్వలేదట.
ఫైనల్ గా ఉదయ్ కిరణ్ ఈ సినిమా కథను విని ఓకే చేశాడట. ఒకవేళ మహేష్ బాబు ఓకే చెప్పిఉంటే కచ్చితంగా ఉదయ్ కిరణ్ చేతికి ఈ సినిమా వచ్చేది కాదు. ఇంత పాపులారిటీ దక్కించుకునే వాడు కాదు ..అయినా ఏం లాభం నూరేళ్ల జీవితం సగంలోనే అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పటికి ఉదయ్ కిరణ్ చావు ఇండస్ట్రీలో మిస్టరీగానే మిగిలిపోయింది.’