ఆదిపురుష్ లో `సీత` పాత్ర‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి స‌న‌న్ న‌టించారు. అలాగే లంకాధిప‌తి రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించారు.

త్రీడీ టెక్నాల‌జీతో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఆదిపురుష్ అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. మే 9న ఈ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందుకోసం గ్లోబ‌ల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. దాదాపు 70 దేశాల్లో ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో సీత పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ కృతి స‌న‌న్ కాద‌ట‌. సీత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. అయితే అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండ‌టంతో.. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయ‌లేక‌ ఈ మూవీని సున్నితంగా రిజెక్ట్ చేసింద‌ట‌. దీపికా తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు పరిశీలించినా.. చివరకు కృతి స‌న‌న్ ఫైన‌ల్ చేశారు. ఇక ఆదిపురుష్ కు నో చెప్పిన‌ దీపికా.. ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ కె` చిత్రంలో నటిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Share post:

Latest