చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో దర్శకుడు స్టోరీని బట్టి ఇద్దరు హీరోయిన్లు లేదా ఒక్క హీరోయిన్ తో సినిమాని తెరకెక్కిస్తాడు. అలా ఒక సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు మళ్లీ వేరే సినిమాలో కూడా మళ్లీ నటిస్తూ ఉంటారు.
ఎందుకంటే ఆ హీరోయిన్లు పర్ఫామెన్స్ బాగుండటం ప్రేక్షకులలో బాగా పేరు సంపాదించుకోవడం వల్ల దర్శకులు ఆ హీరోయిన్లనే మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలలో రిపీట్ అయిన కొంతమంది హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. అందరిలో ముందుగా సమంత- ప్రణతి ఈ ఇద్దరు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అక్క చెల్లెలుగా నటించి మెప్పించారు.
మళ్లీ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రభస సినిమాలో కూడా ఈ ఇద్దరూ కలిసి నటించారు. అయితే ఈ రెండు సినిమాల్లో అత్తారింటికి దారేది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇద్దరి తర్వాత సమంత- కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. ఇద్దరూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బృందావనం సినిమాలో అక్క చెల్లెలుగా నటించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
మళ్లీ ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో సమంత- కాజల్ కలిసి నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలా రెండోసారి రిపీట్ అయినా ఈహీరోయిన్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి.