అప్పుడు లిప్ కిస్సులు..ఇప్పుడు ఏకంగా అదే.. సంచలనం సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ.. నిజంగా రౌడి ఫేలోనే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రెసెంట్ ఎలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సు మని ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పేరుని హ్యూజ్ రేంజ్ లో ట్రేల్ చేశారు కొందరు ఆకతాయిలు. అంతే కాదు మరి కొంతమంది విజయ్ దేవరకొండ కు ఇండస్ట్రీలో స్థానం లేదు అంటూ పర్సనల్గా ఆయనను ట్రోల్ చేశారు . కానీ ఇలాంటివి ఏవి పెద్దగా పట్టించుకోని విజయ్ దేవరకొండ .. తనదైన స్టైల్ లో ముందుకు పోతూ సినిమాలకు కమిట్ అవుతూ వస్తున్నాడు .

కాగా రీసెంట్గా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి . శివ నిర్మాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది . ఇది కాకుండా తెలుగులో మరో సినిమాకి కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. గౌతం తిన్నూరి డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా లో హీరోయిన్గా నటిస్తుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు లవ్ స్టోరీ సినిమాలతో మన ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ .. మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది .

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా చేస్తున్నాడు . అప్పట్లో మహేష్ బాబు – మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు చేసిన ధంప్స్ అప్ యాడ్ ని విజయ్ దేవరకొండ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా విజయ్ దేవరకొండ చేసిన థమ్స్ అప్ యాడ్ కోసం ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . యూత్ లో క్రేజ్ కారణంగానే విజయ్ ఇంతటి డబ్బు ను డిమాండ్ చేశాడట . ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమాతో లిప్ లాక్ ల తో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు ప్లాప్స్ పడుతున్నా కానీ అంత డబ్బు డిమాండ్ చేస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఖుషి సినిమాకు కూడా దాదాపు ఆయన మార్కెట్ కి మించిన రేంజ్ లోనే రెమ్యూనత్రేషన్ చార్జ్ చేస్తున్నారట . ఒక్క యాడ్ కే నాలుగు కోట్లు తీసుకునే విజయ్ దేవరకొండ .. సినిమా హిట్ అయితే ఇంకా ఎంత చార్జ్ చేస్తాడు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . దీంతో విజయ్ దేవరకొండ చేసిన రీసెంట్ యాడ్ వైరల్ గా మారింది..!!

Share post:

Latest