కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎవరికీ తెలియకుండా దాచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు తోటి నటుల్ని, వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకోవటం చాలా మామూలే.. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం నిత్యం ప్రజల ఉండే రాజకీయా నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాధిక కుమార్ స్వామి:
కన్నడ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామిని 2006లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు షమిక స్వామి అనే కుమార్తె కూడా ఉంది. రాధిక కన్నడ తో పాటు తెలుగు తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే కుమార్ స్వామి రాధిక కు రెండవ భర్త, ఆమె మొదటి భర్త గుండెపోటు మరణించాడు.
స్వర భాస్కర్:
బాలీవుడ్ స్టార్ నటి స్వర భాస్కర్ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా స్వరభాస్కర్ సోషల్ మీడియా ద్వారా తన వివాహ బంధాన్ని ప్రకటించింది. సమాజ్వాది పార్టీ నేత ఫహద్ జరీర్ అహ్మద్ను ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుంది.
ఆయేషా టాకియా:
తెలుగులో పలు సినిమాలో నటించిన ఇషా టాకియా 2009లో తన బాయ్ ఫ్రెండ్ మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు అబూ అసిమ్ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని ప్రేమించి పెళ్లాడింది.వీళ్లిద్దరికీ ఒక 9 ఏళ్ళ కుర్రాడు కూడా ఉన్నాడు.
నవనీత్ కౌర్ :
పలు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నవనీత్ కౌర్ ఆమె ఫిబ్రవరి 3, 2011న మహారాష్ట్రలో స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను సామూహిక వివాహం చేసుకుంది. రవి రాణా ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని బద్నేరా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. నవనీత్ కౌర్ కూడా అమరావతి ఎంపీ.
పరిణీతి చోప్రా :
రీసెంట్ గా కొద్దిరోజుల క్రితమే పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాఘవ్ చద్దా ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వీళ్లిద్దరి వివాహ మహోత్సవం ధూమ్ ధామ్ గా జరగబోతుంది.