సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. ఒక్క వీడియోతో జనాలు ఫిదా (వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న శంకర్ పేరు చెప్తే జనాలకు అదో తెలియని కొత్త ఫీలింగ్ వస్తుంది . భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంలో శంకర్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . ఇప్పుడు అంటే రాజమౌళి పేరు రావడంతో ఆయన పేరు వెనకబడిపోయింది కానీ .. అప్పట్లో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు శంకర్ .

కాగా రీసెంట్గా శంకర్ కూతురు అతిథి శంకర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదితి శంకర్ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ రీల్స్ ..ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది . నటిగా మంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ ..రీసెంట్గా తన తండ్రి డైరెక్షన్లో తెరకెక్కిన “స్నేహితుడు” సినిమాలోని ఓ పాటకు అద్భుతంగా డాన్స్ చేసింది.

గోవా బ్యూటీ ఇలియానా – విజయ్ దళపతి జంటగా నటించిన స్నేహితుడు చిత్రంలోని “ఇలియానా చిట్టి బెలియానా “అనే పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసింది . ఈ పాట చూస్తుంటే అందరూ మరో ఇలియానాలానే ఉన్నావు అంటూ పొగిడేస్తున్నారు. బ్లాక్ లెహంగాలో చాలా స్టైలిష్ గా ఇండో మోడరన్ లుక్ లో మెరిసింది . అంతేకాదు తన బెల్లీని గిరగిరా తిప్పేసి కుర్రాళ్లకు మతులు పోగొట్టింది. ప్రెసెంట్ అదితి శంకర్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)

 

Share post:

Latest