“రోజు కు రెండు సార్లు..వారానికి మూడురోజులు”.. తమన్నా అందానికి అసలు సీక్రేట్ అదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందరూ కామన్ గా గమనించే విషయం అందం . గ్లామర్ గా లేకపోతే ఈ గ్లామరస్ ప్రపంచంలో నెట్టుకు రాలేరు . అందుకే గ్లామర్ గా ఉండడానికి అందంగా కనిపించడానికి హీరోయిన్స్ నానా తండాలు పడుతూ ఉంటారు . కడుపుకు అన్నం కూడా తినకుండా రకరకాల డైట్లు ఫాలో అవుతూ.. రకరకాల యోగాలు విన్యాసాలు చేస్తూ బాడీని జీరో సైజ్ లో మైంటైన్ చేయడానికి తాపత్రయ పడుతూ ఉంటారు .

కాగా అలాంటి బాడీ ఫిజిక్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు అందం విషయంలో ఏం చేస్తూ ఉంటారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్న . టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా అందం విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు సీట్ పెంచేస్తూ ఉంటుంది తమన్న.

రీసెంట్ గా తమన్నా మాట్లాడుతూ తన అందాల సీక్రెట్ ను రివిల్ చేసేసింది. నిజానికి తమన్న తన ముఖానికి ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడదట . కేవలం సున్నిపిండి ..పసుపు ..నాచురల్ ఇంగ్రిడియంట్స్ వాడుతుందట . కచ్చితంగా వారానికి రెండుసార్లు ..సున్నిపిండితో నలుగుపెట్టి స్నానం చేస్తుందట. అంతేకాదు వారానికి మూడు రోజులు కచ్చితంగా తలంటు పోసుకున్నప్పుడు పొగ వేసుకుంటుందట .

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నమ్మడానికి ఇబ్బందికరంగా ఉన్న ఇదే నిజం అంటుంది తమన్న . అంతేకాదు తమన్నా ఫుడ్ డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో హెల్ది బాడీ ఫిజిక్ విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటుందట. కచ్చితంగా తిన్న తర్వాత రెండు గంటలు వాకింగ్ కంపల్సరీ చేస్తుందట. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు సుమారు నాలుగు ఐదు లీటర్ల వాటర్ కూడా తగేస్తుందట . ఇలాంటివన్నీ చేయబట్టే తమన్నా ఇంత అందంగా ఉంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనంత నాజూకుగా కనిపిస్తుంది..!!