ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పటి తరం హీరోయిన్లతో తీస్తే బాక్సాఫీస్ బద్దలే!

1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ సితార సినిమాలో కూడా సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించేందుకు సరిగ్గా సూట్ అవుతుంది.

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన “పదహారేళ్ల వయసు” సినిమాలో శ్రీదేవి మెయిన్ లీడ్ పోషించింది. ఈ సినిమా విడుదలైన సమయంలో థియేటర్లలో వంద రోజులు పాటు ఆడి సంచలనం సృష్టించింది. పదహారేళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్ తర్వాత ఎక్కువగా హైలెట్ అయింది శ్రీదేవి పాత్రే. అయితే ఈ పాత్రలో ఇప్పటి తరం హీరోయిన్లలో ఎవరు సరిపోతారా అని పరిశీలిస్తే.. ముందుగా కృతి శెట్టే మనకు గుర్తుకు వస్తుంది.

1999లో రిలీజ్ అయిన దేవి సినిమా కూడా సూపర్ హిట్ అయింది మూవీలో ప్రేమ అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి అందరి హృదయాలను గెలిచేసింది అయితే ఇప్పుడు ఆ పాత్రను ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క అనుష్క శెట్టి అని మాత్రమే చెప్పవచ్చు. స్నేక్ ప్రిన్సెస్ గా అనుష్క శెట్టి సులభంగా నటించగలదని చెప్పవచ్చు.

కాన్ఫిడెంట్ గా ఉండటంతో పాటు ఇంటెన్స్ పాత్రలను చేయడంలో వరలక్ష్మి శరత్ కుమార్ మించిన వారెవరు లేరని చెప్పవచ్చు అందుకే ఈ ముద్దుగుమ్మ ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయశాంతి రూల్ చేయడానికి చక్కగా సరిపోతుంది.

Share post:

Latest