“ఆ విషయంలో తప్పు నాదే”..ఇన్నాళ్లకి అసలు నిజం బయటపెట్టిన స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్, ఎఫైర్ , విడాకులు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి .. వినిపిస్తూ ఉంటాయి . ఏదైనా సినిమా షూటింగ్లో కలిసి వర్క్ చేసే టైం లో సదురు హీరోతో హీరోయిన్ తో ప్రేమలో పడుతూ కొన్నాళ్లపాటు జాలిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చుప్పేసుకోవడం సర్వసాధారణం. ఆ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ .

సల్మాన్ ఖాన్ జీవితంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే . చాలా మందితో హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్స్ నడిపి బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పట్లో అలాంటి విషయాలలో తప్పు మొత్తం హీరోయిన్స్ దే అంటూ సల్మాన్ ఫ్యాన్స్ హీరోయిన్స్ ని తప్పు పట్టారు . అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ఆ విషయాల పై ఓపెన్ గా స్పందించాడు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకి..మీ ప్రేమ కధలతో జీవిత చరిత్ర రాయాలి అనుకుంటున్నారా..? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..”ఆ విషయంలో తప్పు నాదే .. తప్పు నా వైపే ఉంది ” అంటూ ఓపెన్ గా నిజాన్ని ఒప్పేసుకున్నాడు . ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. అయితే సల్మాన్ ఖాన్ – ఐశ్వర్యరాయ్ విషయంలో కూడా తప్పు సల్మాన్ ఖాన్ దేనా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదుసల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

 

 

Share post:

Latest