ఆ విషయంలో అన్న బన్నీనే మించిపోయిన తమ్ముడు శిరీష్.. అల్లువారి పిల్లాడు అంటే ఆమాత్రం ఉండదా ఏంటి..!!

సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు అల్లు రామలింగయ్య గారు . అల్లు ఫ్యామిలీ అని వినగానే ఇప్పటికి అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అల్లు రామలింగయ్య గారే కావడం గమనార్హం. కాగా ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అల్లు పేరుని డబల్ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారే కానీ ఎక్కడ తగ్గించడం లేదు.

మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా టాప్ పొజిషన్లో నిల్చుంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకొని సినీ ఇండస్ట్రీని చెక్ చేస్తున్నాడు . ఇంత పెద్ద పేరు సంపాదించుకుని ఆస్తులు కూడా పెట్టుకున్న సింప్లిసిటీ విషయంలో అల్లు ఫామిలీ ఎప్పుడు ముందుంటుంది . అంతేకాదు హెల్ప్ చేసే విషయంలో కూడా అల్లు ఫ్యామిలి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది .

రీసెంట్గా అల్లు శిరీష్ చేసిన ఓ మంచి పని ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . హైదరాబాదులో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆర్థిక సహాయం చేశారు. చిన్నారి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది అని హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేక తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని తెలుసుకుని తన ఆఫీసుకి పిలిపించి మరి పూర్తి ఖర్చును భరించారట అల్లు శిరీష్ .అంతేకాదు అల్లు అర్జున్ కూడా అంతే ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే చూడలేరు . సహాయం చేస్తాడు . ఆ విషయంలో అల్లు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు టాప్ పొజిషన్లోనే ఉంటారు అంటూ అల్లు ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest