మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు.
తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య- అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. ఈ నెల చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చేనెల జూన్ 12న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 సినిమాని మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.
అఖండతో బాలకృష్ణ మరోసారి తన సత్తా చాటగా అఖండ 2 సరికొత్త కథతో మరో రేంజ్ చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ ఉండటం కూడా ఫ్యాన్స్ కి ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగ చేస్తుంది. సోలో హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం మరి కొన్ని సంవత్సరాల టైం పడుతుందని అంటున్నారు. మరి అఖండ2 లో మోక్షజ్ఞ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.