స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను ప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు. భారతదేశంలో ఏ నటుడుకి దక్కని కీర్తి ఎన్టీఆర్ కు దక్కింది. ఎన్టీఆర్ సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఆయన నటించారు. తెలుగులో కృష్ణుడు, రాముడు అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఎన్టీఆర్. ఆయన తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.
ఇక ఈ క్రమంలోనే ఆయన సినిమాలలో నటిస్తున్న సమయంలో అయనతో నటించడానికి ఎంతోమంది హీరోయిన్లు ఎలాంటి పనులు చేయడానికి అయినా వారు సిద్ధపడేవారు. ప్రధానంగా అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ దేవికా కూడా ఉన్నారు.. ఇక విషయానికొస్తే ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్లు ఆయనకు సరిపడే జోడి అని మంచి పేరు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ తన కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా ఒక హీరోయిన్ తోనే ఆయన నటించేవారట.. ఆమె ఎవరంటే దేవిక. ఎన్టీఆర్ అగ్ర హీరో స్థానం సంపాదించుకున్నాక ఆయన సావిత్రి, శ్రీదేవి, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లతో ఎన్టీఆర్ నటించాడు.
ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ అభిమానులని ఎంతో అలరించాయి. వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా హిట్ అనే పేరు కూడా వచ్చింది. ఎన్టీఆర్ దేవిక కాంబినేషన్లు కూడా ఆ టైంలో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ దేవిక కలిసి నటిస్తే ఆ సినిమా హిట్ అవుద్దని టాక్ కూడా అభిమానులుకు వచ్చింది. ఇకపోతే వీరిద్దరు వరుస సినిమాల్లో నటిస్తూ చాలా క్లోజ్ గా ఉండటంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. దేవికా అప్పుడు ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. కానీ ఒక ఏఎన్నార్ తో మాత్రం ఒక సినిమాలో కూడా నటించలేదు. దేవిక స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎన్నో ఆస్తులను కూడా సంపాదించుకుంది.
ఈమె చెడు స్నేహాలు చేసి తప్పటడుగులు వేయడంతో తన ఆస్తి మొత్తం పోగొట్టుకుంది. ఆమె కన్నా వయసులో చిన్నవాడైన తన అసిస్టెంట్ దేవదాసుతో సహజీవనం చేసిందని వార్తలు కూడా వచ్చాయి. ఈమె అతని సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ చేయాలనీ తన ఆస్తులు మొత్తం అతనికి దారా దత్తం చేసింది. అతని మోజులో పడి సినిమాలలో నటించడం మానేసింది. ఆమె బరువు పెరిగి పోవడంతో ఆమెను సినిమాలలో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపేవారు కాదు. దేవికా సినిమా అవకాశాలు లేక ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఆర్థికంగా నిలతక్కుకోలేకపోయింది. ఈమె నమ్ముకున్న దేవదాసు కూడా ఈమెను మోసం చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు.