నిత్యా మీనన్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం ఆయనేనా..? అంతలా బాధపెట్టాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ అంటే అదో ప్రత్యేక ఆకర్షణగా చూస్తూ ఉంటారు జనాలు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ -వల్గర్ సీన్స్ -హద్దులు మీరిన కంటెంట్ తో టైంపాస్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో కూడా నిత్యామీనన్ లా నాచురల్ యాక్టింగ్ చేస్తు నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తో కేవలం నటిగానే తన పేరును పాపులారిటీ సంపాదించుకోవాలని ఉద్దేశంతో ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ రెమ్యూనరేషన్ తక్కువ అయిన అడ్జస్ట్ అవుతూ వస్తుంది.

కాగా నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఒకప్పుడు వరుసగా తెలుగులో సినిమాలకు కమిట్ అయిన నిత్యామీనన్ ఇప్పుడు ఎందుకు తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే దానికి కారణం తెలుగు డైరెక్టర్ అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . గతంలో ఆయన డైరెక్షన్లో ఓ సినిమాలో నటించిన నిత్యామీనన్ కి కధ పెద్దగా చెప్పి తీరా షూటింగ్ టైంలో చిన్నగా మార్చేశారట .

ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ ను పూర్తిగా నమ్మడం మానేసింది ..కొంచెం గొడవ కూడా చేసింది నిత్యామీనన్ అంటూ ఓ టాక్ వైరల్ అయ్యింది. ఇండస్ట్రీలో ఆయన పలుకుబడి ఉన్న డైరెక్టర్ కావడంతో వేరే డైరెక్టర్స్ కి చెప్పి నిత్యామీనన్ కి అవకాశాలు రాకుండా చేశారట . ఈ క్రమంలోనే నిత్యామీనన్ తెలుగు సినిమాలకు సైన్ చేయడమే మానేసింది . ఎప్పుడో అరాకొరా తనకు కథ బాగా నచ్చితే తప్పిస్తే తెలుగు సినిమాలను చేయకూడదు అని డిసైడ్ అయిందట . చూడాలి మరి నిత్యామీనన్ ఎప్పుడు తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేస్తుందో..?

 

Share post:

Latest