అనుష్క సినిమా టీజర్ పై ప్రభాస్ ఏమన్నాడంటే..?

జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి అలాగే సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క ముఖ్యపాత్రలో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇకపోతే తాజాగా సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడం అయితే చాలాకాలం తర్వాత అనుష్క మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ మరియు ప్రమోద్ నిర్మిస్తున్నారు.

42 साल की उम्र में भी कुंवारे हैं Prabhas, कभी रुकवा दी थी 'देवसेना' Anushka  Shetty की शादी तक, जानें किस्सा - happy birthday prabhas is bachelor at age  of 42 when

ఇకపోతే అభిమానులు, నెటిజెన్లు , సెలబ్రిటీలు కూడా ఈ టీజర్ పై స్పందిస్తూ అనుష్కకు అటు నవీన్ పోలిశెట్టి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా స్పందించాడు యు వి క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ కి హోం బ్యానర్ అవడంతో పాటు అనుష్క అలాగే ప్రభాస్ లు సుదీర్ఘ కాలం పాటు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అనుష్కను తన హోమ్ బ్యానర్ లో నటింప చేయడమే కాదు ఆమె సినిమా టీజర్ కి కూడా స్పందించాడు ప్రభాస్.

ఈ టీజర్ పోస్టర్ను ఆయన తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. టీజర్ చూడడానికి చాలా వినోదాత్మకంగా ఉంది.. చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అంటూ తన ప్రత్యేక శుభాకాంక్షలు అనుష్కతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు తెలియజేశారు ప్రభాస్. ఇకపోతే వెంటనే ప్రభాస్ పోస్ట్ కి స్పందించింది అనుష్క. ఆమె ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు పుప్సు అంటూ సంబోధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అనుష్క ఇలా పిలవడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కొందరు అనుకుంటూ ఉన్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి చర్చ బాగా జరుగుతుంది.

Share post:

Latest