సమంతని ప్రస్తుత పరిస్థితుల్లో అలా చూడడం కష్టమనే అంటున్నారు?

తెలుగు తెర ముద్దుగుమ్మ సమంత గురించి తెలియనివారు వుండరు. తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’తోనే తెలుగు జనాల్ని మాయలో పడేసిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే ఇక్కడ సూపర్ స్టార్ స్థాయిని సొంతం చేసుకుంది. నాటినుండి నేటివరకు అదే ఫామ్ ని మెంటైన్ చేయడం సమంతకు దక్కింది. ఈ క్రమంలో ఆమెనుండి వస్తున్న సినిమా ‘ఖుషి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.

ఇక ఇద్దరు సేమ్ ఇమేజ్ వున్నవారు కావడంతో ఈ సినిమాపైన ఎన్నో అంచనాలు వున్నాయి. లైగర్ సినిమా ప్లాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో రౌడీ అభిమానులు కూడా ఈ సినిమాకోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో కావడంతో సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందాని వెయిట్ చేస్తున్న పరిస్థితి. దాంతో కొంచెం గట్టిగానే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే, మొదట్లో లవ్ స్టోరీ సినిమాలతో మెప్పించిన సామ్ ప్రస్తుతం అదే సబ్జెక్టుతో వస్తున్న సినిమాతో ప్రస్తుతం జనాలను తృప్తి చేయగలదాని చాలామందికి డౌట్ వస్తోంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వుంది. సమంతకు మధ్యలో కొన్ని వ్యక్తిగత సమస్యలు రావడంతో వాటి వల్ల తను చాలా ఎఫెక్ట్ అయింది. దాంతో మునుపటి మేనిఛాయ కోల్పోయింది. అంతేకాకుండా ఇటీవల యశోద, శాకుంతలం లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కెరీర్ పరంగా ఇన్ని షేడ్స్ చూపిస్తున్న సమంత మళ్లీ లవ్ స్టోరీ లో నటించడం ఏమంత కిక్ అనిపించదు అని జనాలు భావిస్తున్నారు.

Share post:

Latest