ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు ప‌ట్టించుకుంటా.. బ‌ర‌స్ట్ అయిన‌ నిహారిక‌!

వివామం త‌ర్వాత న‌ట‌కు బ్రేక్ ఇచ్చిన మెగా డాట‌ర్ నిహారిక.. `డెడ్ పిక్సెల్స్` వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గాయత్రిగా నిహారిక ప్రధానమైన పాత్రను పోషించగా.. వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నిహారిక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంట‌ర్వ్యూలో ట్రోల‌ర్స్ గురించి మాట్లాడుతూ బ‌ర‌స్ట్ అయింది. పని పాట లేని వాళ్లే ట్రోల్స్ చేస్తారు, అలాంటి వెద‌వ‌లు ప్ర‌తి చోటు ఉంటారు.. వారిని ప‌ట్టించుకుంటే ఇంకా ఎక్కువ‌ రెచ్చిపోతారు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

`నా వ‌ర‌కు అయితే అలాంటి ఇడియ‌ట్స్ ను ప‌ట్టించుకోను. ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు ప‌ట్టించుకుంటా..? ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో నాపై వ‌చ్చే నెగ‌టివ్ కామెంట్స్ చేసి బాధ‌ప‌డేదాన్ని. కానీ, ఇప్పుడు వాటిని చూడ‌ట‌మే మానేశా. న‌న్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రీ టైం దొరికితే వాళ్లకే కేటాయిస్తా` అని నిహారిక చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest