నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మూడో సినిమా ఆఖండ. ఈ సినిమా ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమా విడుదలై బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. బోయపాటి మార్క్ డైలాగ్ ఫైట్లతో సినిమాని అదరగొట్టాడు.
ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య విజయ పరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. అఖండ సినిమాలో బాలయ్య వేసిన అఘోర పాత్రకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో.. ఈ సినిమాలో విలన్ గా నటించిన శ్రీకాంత్ పాత్రకి కూడా అదేవిధంగా మంచి గుర్తింపు వచ్చింది.
ఎంతో సాఫ్ట్ గా కనిపించే హీరోలను కరుడుగట్టిన విలన్స్ గా చూపించడం బోయపాటి శ్రీను స్టైల్. గతంలో లెజెండ్ సినిమాలో జగపతిబాబుని కూడా ఇలాగే చూపించాడు. ఇక ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అఖండ సినిమాలో శ్రీకాంత్ పాత్రకి ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అనుకున్నారట.
ఆయన వేరే సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకున్నారట. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ సినిమా ఆయన ఒప్పుకొని చేసి ఉంటే మరింత మైలేజ్ వచ్చేదని ఫ్యాన్స్ అభిప్రాయం.