ఆ హీరోయిన్ ను ముగ్గులోకి దింపిన యాంక‌ర్ ప్ర‌దీప్‌.. ప‌బ్లిక్ గా ప్ర‌పోజ్ చేసేసిన బ్యూటీ!

బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా కొన‌సాగుతున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌.. తాజాగా ఓ హీరోయిన్ ను ముగ్గులోకి దింపాడు. అంతేకాదు, ప్ర‌దీప్ ప్రేమ‌లో ప‌డ్డ స‌ద‌రు హీరోయిన్ ప‌బ్లిక్ గానే ప్ర‌పోజ్ చేసేసింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు మాళ‌విక నాయ‌ర్‌. ప్ర‌స్తుతం మాళ‌విక త‌న తాజా చిత్రం `అన్నీ మంచి శకునములే` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది.

లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టించారు. స్వప్న సినిమా మరియు మిత్ర విందా మూవీస్ బ్యాన‌ర్ల‌పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ మే 18న విడుద‌ల కాబోతోంది. అయితే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మాళ‌విక నాయ‌ర్ తాజాగా చిత్ర టీమ్ తో క‌లిసి ప్ర‌దీప్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `సర్కార్‌` షోకు హాజ‌రు అయింది.

అయితే షో ప్రారంభం నుంచి ప్ర‌దీన్ హీరోయిన్ మాళ‌విక‌పై స్పెష‌ల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ఫైన‌ల్ గా ఆమెను ముగ్గులోకి దింపేశాడు. దాంతో మాళవిక ఇక ఆగలేకపోయింది. దొరికిన క్యాలీ ఫ్లవర్‌ తీసుకుని ప్రదీప్‌కి ఇచ్చి ప్రపోజ్‌ చేసింది. ఇక ఆ క్ష‌ణం ప్ర‌దీప్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఇదంతా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్‌ చేసేందుకే అయినా.. ప్ర‌దీన్, మాళ‌విక జోడీగా మాత్రం బాగుంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest