మృగరాజు సినిమాతో స్టార్ట్ అయిన డిజాస్టర్స్.. అఖిల్ తో ముగింపు?

సినిమా తియ్యడం వరకే దర్శక నిర్మాత పని. ఆ తరువాత సినిమా హిట్ ఆ? ఫట్ ఆ? అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. భారీ బడ్జెట్స్‌తో తెరకెక్కిన ఎన్నో సినిమాలు నిర్మాతలకు చేదు అనుభవాలను మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా కేవలం తెలుగులోనే కాకుండా మిగితా భాషలో కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే సినిమా ప్లాప్ అవడం వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయేది మాత్రం నిర్మాతలే అనేది వాస్తవం.

గత ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ సినిమా ఎంత పెద్ద పరాజయం పాలయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడంతో ఆ నష్టాలను తీర్చమని రోడ్డెక్కిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా దర్శకుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే టాలీవుడ్‌లో అయితే ఇదేం కొత్త విషయం కాదు. తెలుగులో ఉన్న చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకూ అందరూ ఏదో ఒక సమయంలో పరాజయం చవి చూసినవారే.

 

చిరంజీవి ‘మృగరాజు’, ‘ఘరానా మొగుడు’ సినిమాలు ప్లాప్ కారణంగా వైవి ఎస్ చౌదరి మళ్ళీ స్టార్ హీరోలతో కలిసి సినిమా తీయలేకపోయ్యారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన ‘రక్షకుడు’ సినిమా పాతికేళ్ల క్రితమే 15 కోట్లకు అమ్మడు పోయింది. కానీ దాంట్లో పావు వంతు సొమ్ము కూడా వెనక్కి రాలేదు. ఇక డార్లింగ్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమా భారీ బడ్జెట్ కారణం గా లారెన్స్ కి నిర్మాతలకు మధ్య విబేధాలు ఏర్పడాయి. అఖిల్ మొదటి సినిమా కంటెంట్ ప్లాప్ అయ్యి ఆ సినిమా నిర్మాత సుధాకర్ రెడ్డికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇంకా కొంతమంది నిర్మాతలు సినిమా ప్లాప్ కారణంగా నష్టపోయి ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు ఉన్నారు. ఏజెంట్ సినిమాతో సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అలానే తయారైంది.