మాకు టాలీవుడే ముద్దు అంటున్న స్టార్ హీరోయిన్స్..!!

పాన్ ఇండియా రేంజ్ లో ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. గతంలో ఎక్కువగా ముంబై నుంచి హీరోయిన్స్ దిగుమతి అయ్యేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన హీరోయిన్స్ బాగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలీవుడ్ సైతం వద్దని కేవలం టాలీవుడ్ లోనే నటించడానికి ఇష్టపడుతున్న కొంతమంది హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

Requirement of Sai Pallavi and Keerthy Suresh caliber

టాలీవుడ్లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ సాయి పల్లవి నటనతో డాన్స్ తో అందరిని అదరగొట్టేస్తూ ఉంటుంది. సాయి పల్లవి బాలీవుడ్ మూవీ చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి కానీ అవన్నీ కొట్టి పుకార్లే అని తేలిపోయింది.

ఇక మరొక హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మొదట మైదాన్ అనే సినిమాకి ఓకే చెప్పిన ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు విన్నారుగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.

సౌతుల స్టార్ హీరోయిన్గా పేరుపొందిన అనుష్క శెట్టి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే .. ఆమధ్య రణబీర్ కపూర్ సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వచ్చిన ఎందుకో బాలీవుడ్ వైపుగా ఈ ముద్దుగుమ్మ అడుగులు వేయలేదు.

అనుపమ పరమేశ్వరన్ కూడా కేవలం టాలీవుడ్ సినిమాల వైపే ఎక్కువగా మక్కువ చూపుతోంది బాలీవుడ్ సినిమాల వైపు పెద్దగా తక్కువ చూపలేదని వార్తలైతే వినిపిస్తున్నాయి.

కానీ బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఎక్కువగా టాలీవుడ్ సినిమాలలో నటించేందుకే మక్కువ చూపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మలు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారేమో చూడాలి మరి.

Share post:

Latest