మ‌రో వారంలో రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిట్ మూవీ.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించే గుడ్‌ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా మరో వారం రోజుల్లో రీ రిలీజ్ కు సిద్ధమయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. ఏ కరుణాకర‌న్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది.

అలాగే వాసుకి, ఆలీ, వేణుమాధవ్, సంగీత తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్ లో చేసిన నాలుగో సినిమా ఇది. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ బ్యానర్ పై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998లో విడుదలై సంచ‌ల‌న విజయాన్ని నమోదు చేసింది. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.

అప్ప‌ట్లో యూత్ కు పిచ్చి పిచ్చిగా న‌చ్చేసిన‌ ఈ ఎపిక్ ల‌వ్ స్టోరీని 4కె రెజ‌ల్యూష‌న్‌తో జూన్ 30 మ‌ళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేర‌కు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. మ‌రో వారం రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి ప్రేమ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రి రీ రిలీజ్ లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

Share post:

Latest